32.2 C
Hyderabad

పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ను కలిసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం

Indian Red Cross Society executive committee members met with PCC President Mahesh Goud

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇటీవల నూతనంగా ఎన్నికైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యవర్గం టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. గురువారం ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు  చైర్మన్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ డాక్టర్ సీను నాయక్, ట్రెజరర్ కెంపుల నాగరాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు రంజిత్ సింగ్, జగన్ మోహన్ గౌడ్, సభ్యులు పద్మ సుభాష్ లు కలిసి పుష్పగుచ్చం అందజేసి  దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా, ప్రజా సేవయే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. సొసైటీ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని సందర్శించాలని సొసైటీ ప్రతినిధులు కోరగా, తప్పకుండా తొందరలోనే రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, భవనం పరిశీలనకు వస్తానని చెప్పారు.

More articles

Latest article