30.6 C
Hyderabad

భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దసరా అలయ్ బలయ్

Dasara Alai Balai' (festive get-together) organized under the aegis of the Construction Workers' Union

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందూర్, బతుకమ్మ :

 

తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో దసరా పండుగను పురస్కరించుకుని అలయ్ బలై కార్యక్రమాన్నిజిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 14 రంగాలకు చెందిన కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరై ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెంచాల వేణు మాట్లాడుతూ  భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతుగా నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేస్త్రి సంఘం అధ్యక్షులు కల్లెడ గంగాధర్, కార్యదర్శి రామాంజనేయులు,  కోశాధికారి అరీఫ్ పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన గోవా కట్టుట సంఘం కార్యవర్గాన్ని నియమించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులుగా తమ్మల చిలకయ్య (శీను), ఉపాధ్యక్షులుగా గుడుమల భాను, కోశాధికారిగా పిల్లి తిరుమల్లయ్య, కార్యదర్శిగా పిల్లి రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రీషియన్ సంఘం అధ్యక్షులు రమేష్, మేస్త్రి సంఘం కార్యవర్గ సభ్యులు పెంచాల శ్రీనివాస్,  ప్రభాకర్,  బాబూరావు షిండే, కూన గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కార్మికుల మధ్య ఐక్యతను, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసేలా విజయవంతం చేశారు.

More articles

Latest article