29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భారత రాజ్యాంగ సంవిధాన్ దివాస్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత్ రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ఖిల్లా రామ్ మందిర్ మండల అధ్యక్షులు కోడూర్ నాగరాజు అధ్యక్షతన భారత రాజ్యాంగ సంవిధాన్ గౌరవ దివాస్ కార్యక్రమం 9వ డివిజన్ లోని సంతోష్ నగర్ ఎస్సీ కాలనీలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ రాజ్యాంగం 75వ వార్షికోత్సవం సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు జనవరి 11 నుండి జనవరి 25 వరకు “సంవిధాన్ గౌరవ్ అభియాన్” దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తయిన అద్భుత ఘట్టాన్ని పురస్కరించుకుని.. “హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్” అనే నినాదంతో ఈరోజు మనం ఉత్సవాలు జరుపుకుంటున్నామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో బిఆర్ శివప్రసాద్, బుస్సాపూర్ శంకర్, అంబదాస్ రావు, సాధు సాయి వర్థన్, వెల్డింగ్ నారాయణ, పుట్ట వీరేంధర్, మండల పదాధికరలు, శక్తి కేంద్రం ఇంచార్జీలు, 9వ డివిజన్ ప్రజలు, మహిళలు  పాల్గొన్నారు.

Indian Constitution Samvidhan Diwas

More articles

Latest article