నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: పోలీసు సేవలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ స్వీకరించేందుకు రూపొందించిన క్యూ ఆర్ కోడ్ వాల్ పోస్టర్లను రైల్వే ఎస్సై సాయిరెడ్డి సిబ్బందితో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు సిటిజన్ ఫీడ్ బ్యాక్ వాల్ పోస్టర్లను రైల్వే స్టేషన్ లో ఆవిష్కరించామని అన్నారు. ఫిర్యాదులు, ఎఫ్ఐఆర్, ఈ చలాన్, పాస్ పోర్టు ధ్రువీకరణ తదితర అంశాలపై ప్రజలు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఫీడ్ బ్యాక్ తెలుపొచ్చని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.