- జగ్గారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ కంచర్ల రవి గౌడ్
రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :కేసీఆర్, కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉపాధ్యక్షులు జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. ఈ సందర్భంగా గురువారం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్, ఐటీ రంగంలో తెలంగాణను దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన కేటీఆర్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని తాము సహించబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో తెలంగాణ బిడ్డలను బలిగొన్నదని పేర్కొన్నారు. “కేసీఆర్, కేటీఆర్‌పై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఎవరు అవకాశవాదులో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కేటీఆర్ అభిమానులుగా మేము ఊరుకోము” అని రవి గౌడ్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో వడ్లూరి సాయి,సూర్య, ఎస్.కె అప్రోచ్, శ్రీనివాసరావు, కిరణ్, రాజేష్, అర్జున్, సంతోష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
