24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆసరా పెన్షన్ల పెంపుకోసం మహా గర్జన

Must read

📰 Generate e-Paper Clip

  • ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ

 

బతుకమ్మ, బాన్సువాడ : వికలాంగులు , ఆసరా పెన్షన్ దారుల కోసం ప్రభుత్వం హామీ ఇచ్చిన పెన్షన్ పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, వచ్చే సెప్టెంబర్ 9న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో “మహాగర్జన” పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్టు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ వెల్లడించారు.  శనివారం బీర్కూర్ లోని వృద్ధులు వితంతువులు వికలాంగులుఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాల్సిందే. లక్షల మంది ఆసరా, వికలాంగుల పెన్షనుదారులను సమీకరిస్తాం. మహాగర్జనతో హైదరాబాద్ రహదారులను దిగ్బంధిస్తాం. అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. అందులోపే వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మంద కృష్ణ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. “ఇంకా మొండితనం కొనసాగితే, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం” అని పేర్కొన్నారు. మహాగర్జన ద్వారా తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంగా తెలియజేస్తామని, తమ హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ గోనే సురేష్, ఎమ్మార్పీఎస్ బిచ్కుంద ఇన్చార్జ్ మేత్రి హన్మండ్లు వికలాంగుల సంఘం సలహాదారులు ఉప్పరి శివరాం మరియు వృద్ధులు వితంతులు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article