. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
గ్రామ పంచాయతీ ఎన్నికలు -2025 ఫేజ్-3 లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌కు ఈ నెల 17 ఎన్నికలు జరగనున్నందున ప్రజా శాంతి భద్రతల నిర్వహణ కోసం 163 బి ఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లోని ( ఆర్మూర్ , ఆలూర్ , బాల్కొండ , భీంగల్ , దొంకేశ్వర్ , కమ్మర్పల్లి , మెండోరా , మోర్తాడ్ , ముప్కాల్ , నందిపేట్ , వేల్పూర్ , ఏర్గట్ల ) లో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి 163 బి ఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. సంబంధిత ఏరియాలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుమిగూడకూడదన్న, అందుకు సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలి అన్నారు. ఈ నెల 15 నుంచి 18 వరకు బి ఎన్ఎస్ఎస్ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. బి ఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 అమలు ఆదేశాలను ఉల్లంఘించే ఏ వ్యక్తి అయినా చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడును అని పోలీస్ కమిషనర్ తెలియజేయడం జరిగింది.
