నిమజ్జనం బందోబస్తు ఎఫెక్ట్

0 14,559
  • రాజంపేట ఎస్ హెచ్ ఓ  హెడ్ క్వార్టర్ కు అటాచ్డ్
  • రాజంపేట ఎస్ హెచ్ఓ గా ఎన్.రాజు

 

రాజంపేట, బతుకమ్మ : వినాయక నిమజ్జనం సందర్భంగా విధుల్లో నిర్లక్ష్యం వహించిన కామారెడ్డి జిల్లా రాజంపేట ఎస్సై దత్తాద్రి గౌడ్ పై వేటు పడింది. ఆయనను ఏఆర్ హెడ్ క్వార్టర్ కు అటాచ్  చేస్తూ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో గణేష్ నిమజ్జనం సందర్భంగా శోభయాత్రల్లో డిజెలకు పోలీసులు అనుమతులు నిరాకరించిన విషయం తెలిసిందే. డీజేలు పెడితే వాటిని సీజ్ చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. అయినా పలు ప్రాంతాల్లో డీజేలు ఏర్పాటు చేశారు. అలాగే రాజంపేట మండలంలో కూడా పలువురు యువకులు డీజేలు ఏర్పాటు చేయగా వాటిని నిరోధించడంలో ఎస్సై నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు ఉన్నాయి. రాజంపేట మండల కేంద్రంలో వినాయక నిమజ్జన వేడుకలలో ఘర్షణ నెలకొనడంతో  పరిస్థితులను సమీక్షించడానికి వచ్చిన ఏఎస్పీ కారు పై రంగులు చల్లుతూ ఇబ్బందులు సృష్టించారు. మండల కేంద్రంలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని శాంతియుత వాతావరణంలో జరుపుకుంటే గతంలో ఉన్నటువంటి కేసులను కొట్టివేస్తానని  ఇటీవల శాంతి కమిటీ సమావేశంలో యువతకు సూచించారు. అయితే యువకులు అతిగా ప్రవర్తించడంతో స్పెషల్ ఫోర్సును రప్పించారు. అంతటికి ఆగకపోవడంతో స్వయంగా ఏఎస్పి బిక్కనూర్, సదశివ నగర్, రాజంపేట ఎస్సైల సహకారంతో సాయంత్రం ఐదు గంటల వరకు పూర్తిగా నిమజ్జన కార్యక్రమం చేపట్టాలని ప్రయత్నించారు. అయితే సహకరించని కొంతమంది గుర్తుతెలియని యువకులు ఏఎస్పీ వాహనం పై రంగులు జల్లడం నృత్యాలు చేయడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్థానిక పోలీసులకు బందోబస్తు అప్పగించి ఎట్టి పరిస్థితులను నిమజ్జనం అయ్యేవరకు పరిస్థితిని అదుపులోకి తేవాలని ఆదేశాలిచ్చారు అధికారులు. అయితే ఎన్నడు లేని విధంగా ఓ ఐపిఎస్ క్యాడర్ గల ఆఫీసర్ కారు పై రంగులు జల్లి నృత్యాలు చేయడంతో వారు అసహనం వ్యక్తం చేస్తూ వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. అనుకున్న సమయాని కన్నా మించి నిమజ్జనం చేయడం , యువతకు శాంతి సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించిన మార్పు రాకపోవడం స్థానిక ఎస్సై దత్తాద్రి విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. గతంలో రాజంపేటలో పనిచేసి విఆర్ లో ఉన్న ఎన్.రాజుకు రాజంపేట ఎస్ హెచ్ ఓగా అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీచేసారు.

  • ఇద్దరు హోంగార్డుల సస్పెన్షన్..

దేవుని పల్లి పోలీస్ స్టేషన్ హోంగార్డు మోగులయ్య (655),  కామారెడ్డికి చెందిన హోంగార్డు సత్యనారాయణ (715) లను సస్పెన్షన్ చేస్తు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మోగులయ్య ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు గైర్హజరు కావడమే కాకుండా రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటున్నందుకు సస్పెండ్ చేశారు. గణేష్ నిమజ్జన బందోబస్తు డ్యూటీకి గైర్హాజరైనందుకు విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ప్రజలలో పోలీస్ శాఖ పట్ల విశ్వాసం నిలబెట్టేందుకు బాధ్యతయుతంగా విధులు నిర్వహించాలని, నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.