27.5 C
Hyderabad
Friday, July 31, 2026

తమిళనాడు లో ‘ ఇళయ దళపతి ’కే పట్టం

Must read

📰 Generate e-Paper Clip

 

 . . . కౌంటింగ్ లో దూసుకుపోతున్న టివికే

. . . ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు

 వెబ్ డెస్క్, బతుకమ్మ:

తమిళ నాడు ఓటర్లు ఇళయ దళపతి విజయ్ కే ఓటు వేశారు. తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో తమిళ వెట్రి కళగం పార్టీ( టివికే) సంచలనం సృష్టిస్తుంది. సోమవారం ఉదయం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఫలితాలలో అధికార డీఎంకే  ముందు వరుసలో నిలిచి తరువాత టివికే దాన్ని వెనక్కి నెట్టింది.  ఇవియం ఓట్ల లెక్కింపు ప్రారంభం తర్వాత విజయ్ పార్టీ అప్ర హతీత ఫలితాలతో ద్రవిడ పార్టీలను దాటి  100 సీట్ల మార్కును దాటారు. ప్రతిసారి డీఎంకే లేదా ఎఐ డియంకేలు మాత్రమే అధికార మార్పిడి అనేది అనవాయితీగా వస్తుంది. కరుణానిధి మొదలుకొని జయలలిత వరకు ఉన్న సంప్రదాయాన్ని విజయ్ బద్దలు కొట్టారు. టివికే స్థాపించిన ఏడాదిలోపే అధికార పగ్గాలు చెరువలో నిలుస్తుంది. ఎగ్జిట్ పోల్ తో పాటు తాను చేసిన డెవలప్మెంట్ రెండోసారి అధికార పగ్గాలు పట్టాలనుకొన్న స్టాలిన్  పార్టీ( డీఎంకే) 51 స్థానాల్లో అధిక్యతతో మూడవ స్థానం కు పరిమితమైంది. ఈ సారి ఎలాగైన అధికారం చెపట్టాలని కలలుగన్న ఎఐడియంకే 70 స్థానాలలో అధిక్యతతో రెండవ స్థానంకు పరిమితమైంది. మొత్తం మీద టివికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు చేసింది. ఎకంగా దేశంలో ఐదు రాష్ట్రాలలో కోత్త పార్ట అధికారం లో చేపట్టడం అనేది తమిళనాడు నుంచి కావడం విశేషం. ఫలితాల కారణంగా అధికార డీఎంకే కార్యాలయం బోసి పోగా, టి వి కే  పార్టీ నాయకులు, విజయ్ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఫలితాలు పూర్తిగా వెలువడే ఎందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్న ముక్కోణపు పోటీ ఇళయ దళపతి విజయ్ సీఎం కావడం లేదా కింగ్ పిన్ కావడం అనేది ఖాయమైంది. మ్యాజీక్ ఫీగర్ 119 స్థానాలను దక్కించుకుంటుందని ఫలితాల సరళి వలన తెలుస్తుంది.

 

'Ilaya Thalapathy' gets title in Tamil Nadu

More articles

Latest article