. . . ఐకేపి వివోఏల సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు
రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత కార్యాలయం ఎదుట ఐకెపి వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారం నాటికి ఐదవ రోజుకు చేరింది. ఈ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వీవోఏలకు కనీస వేతనం రూ.26,000 వేలు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని, అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతి కల్పించాలని, 58 జీవో ను సవరించాలని, వివోఏలకు సాధారణ & ఆరోగ్య బీమా సౌకర్యం రూ.20 లక్షల రూపాయల వరకు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెలో అధ్యక్షురాలు జరీనా, ఉపాధ్యక్షురాలు జిజియా భాయ్, కార్యదర్శి జి.స్వరూప, సహాయ కార్యదర్శి నాగరాణి, కోశాధికారి లావణ్య, బీఆర్ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు కొత్తపల్లి రవి కిరణ్, శివ కుమార్, సాయి కుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
