28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

అయిలాపూర్ గ్రామంలో బడిబాట

Must read

📰 Generate e-Paper Clip

 

లింగంపేట్, బతుకమ్మ :

 

లింగంపేట మండలంలోని అయిలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శుక్రవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న తల్లిదండ్రులు వద్దకు వెళ్లి ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు దామోదర్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. బడి అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి, విద్యా విషయాలకు సంబంధించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నది అన్నారు. కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బులు వృధా చేసుకోకుండా మీ పిల్లలందరినీ మన ఊరు ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని సూచించారు. ప్రైవేటు బడులు వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మొగ్గు చూపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజయ్య, సిఆర్పి సత్యనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పద్మ, శివానందతో పాటు ఉపాధి హామీ పథకం కూలీలు పాల్గొన్నారు.

More articles

Latest article