బోధన్, బతుకమ్మ :
రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ విస్తరణ కార్యక్రమంలో భాగంగా బోధన్ డివిజన్ ఆర్డీఓ విజయకుమారి ని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బుస్స ఆంజనేయులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలు, సభ్యత్వం ప్రాధాన్యత గురించి వివరించారు. దీనికి ఆర్డీఓ సానుకూలంగా స్పందిస్తూ తమ కార్యాలయ సిబ్బంది మాత్రమే కాకుండా ఇతర ప్రభుత్వ అధికారులతో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడతామని హామీ ఇచ్చారు. అనంతరం బోధన్ ఎం.ఆర్.ఓ విట్టల్ ని కలవగా ఆయన కూడా సానుకూలంగా స్పందించి రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరువ అవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బోధన్ డివిజన్ చైర్మన్ బసవేశ్వర్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ రావు, బోధన్ మండల చైర్మన్ కొడాలి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
