- అంగరంగ వైభవంగా ప్రారంభమైన విజయ్ పాఠశాల టాలెంట్ షో
బతుకమ్మ, నిజాబాద్ సిటీ : తల్లిదండ్రులు, గురువుల మాట వింటే చాలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అని (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు) డాక్టర్ కె రామాచారి అన్నారు. ఈ మేరకు మంగళవారం అంగరంగ వైభవంగా విజయ్ పాఠశాల 45 వ టాలెంట్ షో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు) డాక్టర్ కె రామాచారి, గౌరవ అతిథి గా(గీత రచయిత అండ్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత) కాసర్ల శ్యామ్, గౌరవ అతిథి గా (రచయిత్రి, సంపాదకురాలు, నటి, శాస్త్రీయ నృత్యకారిణి) సరస్వతి కరావడి, విజయ్ విద్యాసంస్థల కార్యదర్శి అమృతలత లు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి టాలెంట్ షో ను ప్రారంభించారు. విజయ్ హై స్కూల్ 45 వ టాలెంట్ షో సందర్భంగా (ప్లేబ్యాక్ సింగర్ అండ్ లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకుడు) డాక్టర్ కె రామాచారి మాట్లాడుతూ.. తాను చదివిన పాఠశాలను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 45 సంవత్సరాలు విజయ్ పాఠశాల పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం అని తెలియజేశారు. రైతులు ఎంత కష్ట పడి పండిస్తారో, అలాగే విద్యార్థులకు విద్య నేర్పించి ఉన్నత స్థాయిలో కి ఎదిగేలా కృషి చేసేది పాఠశాలలు అని తెలియజేశారు. మనస్సుకు ఆహారం ల గురువులు విద్యానందిస్తారు. బడి అన్నా పిల్లలన్నా నాకెంతో ఇష్టం అని తెలియజేశారు.విజయ విద్యాసంస్థల్లో ఒక పండగ వాతావరణం నాకు కనిపించింది. అదేవిదంగా గౌరవ అతిథి గా(గీత రచయిత అండ్ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీత) కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ…గత నలభై ఐదు ఏండ్లుగా నడుపబడుతున్న విద్యావ్యవస్థ విజయ్ పాఠశాల విజయ పతాకంతో ముందుకు సాగుతుంది అని అన్నారు. డాక్టర్ అమృతలత

రచయితగా,రాజకీయ వేత్తగా వివిధ రంగాలలో ప్రవీణ్యురాలై విద్యార్థులను తీర్చి దిద్దుతున్న ఘనత ఆమెకే దక్కుతుందని చెబుతున్న నాకు గర్వంగా ఉంది. విద్యార్థులకు ఉపాద్యాయులు వారి అనుభవాలను గుర్తు చేయాల్సిన బాధ్యత కలిగి ఉండాలి. తద్వారా విద్యార్థుల జీవితాల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత నలభై ఐదు ఏళ్లుగా విజయవంతంగా నడుపుతూ,సమాజంలో మంచి గుర్తింపును పొందడంలో విజయ్ హై స్కూల్ మహిళా శక్తిని నిరూపించుకుంటుంది.ఆడపిల్లలని ఆదరించి వారికి ప్రోత్సహిస్తే వారి జీవితాల్లో వెలుగును నింపినవారౌతాము.అమృతలతా అమ్మ ఒక సామాజిక వెత్తగానే కాకుండా అన్ని రకాలుగా గొప్ప మనస్తత్వం కలిగిన వారని పేర్కొన్నారు. అనంతరం నటి, శాస్త్రీయ నృత్యకారిణి) సరస్వతి కరావడి మాట్లాడుతూ.. అమ్మ నాన్న లను ఎదిగే స్థాయికి తీసుకెళ్లాలి. తల్లిదండ్రులకు, గురువులకు గౌరవం ఇవ్వాలి. వారిని ఎప్పటికీ మరవకూడదు. చిన్నప్పటి నుండి పెంచిన తల్లిదండ్రులను ఎదిగాక మంచిగా చూసుకోవాలి,గొప్పగా చెప్పుకోవాలి. సోషల్ మీడియా కు దూరంగా ఉండాలి.చదువు తో పాటు క్రీడలు,లలిత కళలు, పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి.ఉన్న ఒక జీవితానికి మంచిగా జీవించాలి. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహం గా ఉండాలి. పట్టుదల ఒక సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అమృతాలత జీవితంలో నిరూపితమైందని ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. నిజామాబాద్ జిల్లాలో విజయ పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా బాగుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు మంచి అనుభూతి లభిస్తుందన్నారు. చిన్నతనం నుండే విద్యార్థులు ప్రతిదీ నేర్చుకోవాలని అలా నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు గొప్పగా ఆలోచించగలుగుతారన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్ణయించుకొని ముందుకు సాగాలన్నారు.

- అలరించిన చిన్నారుల నృత్యాలు..
వార్షికోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులకు 2025-26 సంవత్సరానికి అన్ని రంగాలలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు. అనంతరం ముఖ్య అతిథులను విజయ్ పాఠశాల తరఫున మెమెంటో, శాలువాలతో సత్కరించారు. టాలెంట్ షో కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. సినీ పాటలపై చిన్నారులు, విద్యార్థులు చేసిన డాన్స్ లు , భరతనాట్యం ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి అమృతలత, రమాదేవి, లలిత దేవి, విజయ భారతి, విజయ లక్ష్మి, మధు, కరస్పాండెంట్ ప్రభాదేవి అకాడమిక్ డైరెక్టర్ వసంత, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ సుజాత, ప్రిన్సిపల్ విజేత, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
