27.1 C
Hyderabad

సన్నధాన్యం కొనుగోలు చేయకపోతే పురుగుల మందు తాగుతాం

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ: సన్నరకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి అజామాబాద్ సొసైటీ పరిధిలోని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం దిగుబడి వచ్చి నెలలు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ అధికారి దురాహంకారంతో మాటాలాడుతున్నారని బుధవారం సొసైటీని ముట్టడించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు ఎంత చెప్పినా విననని రైతులు తాము పురుగుల మందు తాగి చస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడి సన్నారకం వడ్లను కొనుగోలు చేయాలని రైతులు కోరారు. సంతోష్ రెడ్డి, సాయిబాబా, రాజిరెడ్డి,  పీకే నరేశ్, సురేందర్, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

If we don't buy grain, we drink insecticide

More articles

Latest article