26.2 C
Hyderabad

ఈవ్ టీజింగ్ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాలి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: ఈవ్ టీజింగ్‌ చేస్తే షీ టీంకు సమాచారం ఇవ్వాల నీ ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈవ్‌ టీజింగ్‌ చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలని మెండోరా ఎస్సై సుహసిని,  సబ్ డివిజన్ షీ టీం కానిస్టేబుళ్లు, విగ్నేష్‌, సుమతి   అన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్ అండ్ కాలేజ్ జూనియర్ గర్ల్స్ లో క్రైమ్ గురించి విద్యార్థినిలకు బుధవారం అవగాహన సదస్సు కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినిలు, ఉద్యోగినిలు, మహిళలు ఈవ్‌టీజింగ్‌, వేధింపులకు గురైతే పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన షీ టీంకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం ఇచ్చిన మహిళలు, విద్యార్థినిల పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఈవ్‌ టీజింగ్‌కు గురయ్యేవారు భయపడకుండా సమాచారం ఇస్తే రక్షణ కల్పిస్తామన్నారు. షీ టీం నెంబర్‌ 8712659795కు, డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా షీ టీం వారికి ఫిర్యాదు చేసే విధానాన్ని మహిళలకు వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గోదావరి, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

If Eve is teasing, she should inform the team.

More articles

Latest article