బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని రఘునాథ చెరువు ప్రాంతంలో కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. వాకింగ్ సభ్యులు, జై భవాని యువత సమక్షంలో నూతన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో దంపతులతో గత రెండు రోజులగా యజ్ఞ హోమం కార్యక్రమం, అన్న ప్రసాదం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం.నరేందర్ రెడ్డి, బి.నాగరాజు, నారాయణ స్వామి మురళీధర్, వెల్డింగ్ నారాయణ అవదుగురి నారాయణ, కొరడి భూపాల్ , గోపాల్ రామ్మూర్తి శ్రావణ్, శేఖర్, శ్రీకాంత్, అంజయ్య కాలనీవాసులు పాల్గొన్నారు.
