27.3 C
Hyderabad
Friday, July 31, 2026

కోతులు, కుక్కలు కరిస్తే… రోగులే డ్రెస్సింగ్ చేసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇది ఇందల్వాయి హాస్పిటల్ తీరు

 

. . . అయోమయంలో రోగులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

కోతులు, కుక్కలు కరిచి వైద్యం కోసం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళితే విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోతులు కరిచి ప్రాథమిక చికిత్స కోసం ఇందల్వాయి మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కేవలం ఇంజక్షన్ ఇచ్చి, మందులు ఇచ్చారని, రక్తం కారుతున్న కనీసం డ్రెస్సింగ్ చేసే నాథుడు కరువయ్యారని బాధితురాలు స్వప్న తెలిపింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం మే 25 సోమవారం ఉదయం సప్న కుమారుడు ఆరవ తరగతి విద్యార్థి హర్షతేజ్ ఇంటి ముందర ఆడుకుంటున్న సమయంలో కోతులు దాడి చేసి గాయపరిచాయని తెలిపారు. దీంతో హుటాహుటిన సర్కార్ ఆసుపత్రికి తీసుకెళ్తే కోతులు గాని, కుక్కలు గాని కరిస్తే బాధితులే డేటాల్ సబ్బుతో, గోరువెచ్చ నీటితో శుభ్రపరుచుకోవాలని ఆసుపత్రులో విధులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది ఉచిత సలహా ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి సోమవారం విధులలో ఉన్న ఆరోగ్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందల్వాయి ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ను వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేదు.

More articles

Latest article