- ట్రాక్టర్ల కొనుగోలులో కమీషన్ వసూలు
- మాజీ మంత్రి కి కారు గిప్ట్ ఇచ్చి.. ఈఎంఐల ఎగవేత
- ఎక్స్ లో కవితక్క అప్టేడ్స్ పేరిట సంచలన పోస్ట్
హైద్రాబాద్, బతుకమ్మ: ఎక్స్ లో కవితక్క అప్టేడ్స్ పేరిట గురువారం సంచలన పోస్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ గా మారింది… మంగళవారం బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్… బుధవారం ఎమ్మెల్సీ పదవికి, బిఆర్ఎస్ పార్టీ పదవికి కవిత రాజీనామా చేసిన విషయం విధితమే. అమెరికా పర్యటనను ముగించుకొని వచ్చిన కల్వకుంట్ల కవిత కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రభుత్వం సిబిఐకి అప్పగిస్తు అసెంబ్లీ తీర్మాణం చేసిన విషయంపై మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కవిత మీడియా సమక్షంలో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మాజీ సీయం కేసిఆర్ ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ నెల 3న బీఆర్ఎస్ కు, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. మీడియా సమక్షంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను టార్గేట్ చేస్తూ అవినీతి ఆరోపణలు చేసారు. దానిని కొనసాగింపుగా ఎక్స్ వేదికగా మాజీ ఎంపీ సంతోష్ రావును టార్గేట్ చేసిన పోస్టు యథాతధంగా..
కేసీఆర్ గారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు. సంతోషంగా హ్యాపీ రావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలు పెట్టాడు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది. తన బినామీ అయిన వరికోలు వాసి, కోడిపందాలు చేసే హ్యాపీ రావు క్లాస్ దోస్తుతో 120+ కోట్ల కమిషన్ కోసం స్కెచ్ వేసాడు. అప్పటికే ఆ పిస్సార్ ట్రాక్టర్‌కి సంబంధించిన బిజినెస్ చేసి ఉండటం వల్ల బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకుని, ఒక్కో ట్రాక్టర్‌కు లక్ష రూపాయిలు ఇవ్వాలనే ఒప్పందం కుదిరించుకున్నారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి, అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా, అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కారుకి ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీ రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి ఆ అవసరం లేని కారుకు తన సొంత పైసలతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థికి వచ్చాడు. ఆ 120+ కోట్లు ఇద్దరూ పంచుకుని, ఆ మంత్రికి మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయాయి. ఈ మధ్యనే కుట్టుమిషన్లు పంచుతున్నారు.

