హైదరాబాద్, బతుకమ్మ : మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలో బుధవారం కల్తీ కల్లు సేవించడంతో ఆరుగురు మృతి చెంది, సుమారు 15 మంది అస్వస్థతకు గురైన ఘటనపై శ్రీ రామారావు అనే వ్యక్తి ఆన్‌లైన్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ విషాద సంఘటనపై గురువారం అన్ని ప్రధాన వార్తపత్రికలు ప్రచురించాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కేసు నమోదు చేస్తూ తెలంగాణ ప్రభుత్వ రెవిన్యూ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీని ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు 20,2025 లోపు దాఖలు చేయాలని ఆదేశించింది.
