. . . దందాలలో ఆరితేరిన వారిపై ఎసిబి శీతకన్ను
. . . అవినీతి .. ఆక్రమాలతో కోట్లకు పడగలేత్తిన వారిపై రైడ్ లు ఎవి?
. . . పొలిటికల్ అండాలతో రెచ్చిపోతున్న అవినీతి అధికారులు
. . . చోధ్యం చూస్తున్న అవినీతి నిరోధక శాఖ
నిజామాబాద్, బతుకమ్మ :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎసిబి దూకుడు పెంచింది. దాని దూకుడుకు ప్రధానంగా అవినీతికి కేరాఫ్ గా ఉన్న ప్రభుత్వ శాఖలైన రెవిన్యూ, విద్యా, రిజస్ట్రేషన్, మున్సిపల్, రవాణా, ల్యాండ్ సర్వే, ఎక్సైజ్, పోలిస్, వైధ్యం ఆరోగ్యం, విధ్యుత్, పంచాయతీ రాజ్, నీటి పారుధల శాఖలు గజ గజాలాడాయి. తోలిసారి ఇంజనీర్ ఇన్ చీఫ్ లు మొదలుకోని అధనపు కలెక్టర్ లు, డిఎస్పీలు, డిఇలు, ఎఇలు, కమీషనర్ లు, సబ్ రిజిస్ర్టార్ లు, ఎక్సైజ్ సూపరింటేండేంట్ లు, డైరెక్టర్ స్థాయి అధికారులు ఉచలను లెక్కపెట్టారు. మరికోందరిని ఆదాయానికి మించిన అస్థులను కలిగిన వారిని కటా కటాల వెనక్కి పంపారు.. ఇదంతా పార్శ్వానికి ఓకవైపుగా చెప్పాలి…
నిజామాబాద్ జిల్లాలో 1994 లో ఎఎంవిఐగా ప్రస్థానం ప్రారంబించి ఉమ్మడి జిల్లాలోనే ఎంవిఐగా పదోన్నతి పోంది చెక్ పోస్టులలో పనిచేసి ఆర్ టిఓగా పదోన్నతి పోంది.. ఇటివల కాలంలో డిప్యూటి ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ గా మహభూబ్ నగర్ లో పనిచేస్తున్న కిషన్ నాయక్ ను ఈ నెల 23న అధాయానికి మించిన ఆస్థుల కేసులో ఎసిబి అరెస్టు చేసింది. అతని వద్ధ రిజిస్ట్రేషన్ ల లెక్కల ప్రకారం రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వాటి విలువ బహిరంగ మార్కేట్ లోనే రెండు వందల కోట్లు అని తెలియడంతో అందరు షాక్ కు గురయ్యారు. కిషన్ నాయక్ ఆస్థులు ఓక్క నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే రూ.50 కోట్లకు పైగా ఉన్నాయని తెలిసి అందరు నోళ్లు వెళ్లబెట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపాల్టీలో జూనియర్ అసిస్టెంట్ గా కారుణ్య నియామాకం ద్వార ఉద్యోగ ప్రస్తానం ప్రారంభించి అంచేలంచేలుగా ఎదిగా మున్సిపల్ కార్పోరేషన్ లో రెవిన్యూ ఇన్స్ పెక్టర్ గా పనిచేస్తున్న నరేంధర్ వద్ధ 2024 లొ ఎసిబికి రూ.6.25 కోట్ల నగధు పట్టుబడినప్పుడు అబ్బా ఓక్క చీరు ఉద్యోగి వద్ధనే కోట్లు పట్టుబడ్డాయని చర్చ జరిగింది… ప్రజలు మరిచిన ఎసిబి కుడా ఆదాయానికి మించిన కేసులను పెద్ధగా పట్టించుకున్నట్టు కనిపించడంలేదు.

ఒక్క నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే ఎసిబి కి చిక్కన కిషన్ నాయక్ లాంటి అధికారులు ఎందరో అని ప్రభుత్వ శాఖలలో చర్చ జరుగుతుంది విద్యా, వైధ్య , బల్ధియా, రెవిన్యూ, రవాణ, కరేంట్, పోలిస్, ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లలో ఉద్యోగాలను వెలగబేడుతు కోందరు కోట్లకు పడగలేత్తారు. వారు గేజిటేడ్ హోదాను అందుకునే వరకు కోట్ల కోద్ధి డబ్బును పోగేశారు. నిజామాబాద్ జిల్లాలో రియల్ ఎస్టేట్ లో, లిక్కర్ దందాలో, బిల్డర్ లుగా, పైనాన్సీయర్ లు గా, పెట్రోల్ బంక్ లను, విద్యా సంస్థలను, ఎజేన్సిలలో, ఆసుపత్రులలో పెట్టుబడులు పెట్టిన ఉద్యోగులు కోట్లను ఆక్రమ పద్ధత్తులలో పోగేస్తున్న పట్టించుకున్న దాఖాలలు లేవు. పోగేసిన డబ్బులతో పోలిటికల్ లీడర్లతో, కుల సంఘాల పేరుతో రాజకీయాలను చేస్తు సంఘంలో మంచివారిగా చెలమణి అవుతున్నారు.. కోందరు ఎకంగా జిల్లా కలెక్టర్ లు, అదనపు కలెక్టర్ లు, వివిదశాఖాల అధికారులతో మచ్చిక చేసుకుని, చివరకు ఎమ్మెల్యేలు.. మంత్రులకు తాయిలాలు ముట్టచేప్పి తమ చేతికి మట్టి అంటకుండా కోట్లకు పడగలేత్తడం విశేషం. వివిధ యూనియన్ లకు లీడర్లుగా అక్కడ పెత్తనం చేస్తు ఎసిబికి చిక్కకుండా తప్పించుకుంటుండటం విశేషం….

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రెవిన్యూ శాఖలో పనిచేస్తున్న అధనపు తాహసీల్థార్ దందాలలో అరి తెరిపోయారు. గతంలో పనిచేసిన కలెక్టర్ లను, అధనపు కలెక్టర్ ( రెవిన్యూ) లను బుట్టలో వేసుకుని ఎన్నో వందల ఎకరాల అసైండ్, ఇనాం, వక్ప్ భూములను పట్టా భూములుగా మార్చిన ఘనత కలిగిఉన్నారు. కోందరితో కోన్ని సంవత్సరాల క్రితం వరకు రియల్ ఎస్టేట్ దందాలో మునిగి తెలిని అచిరుద్యోగి… డిటీగా పదోన్నతి పోందిన తరువాత బిల్డర్ గా అవతారం కోట్ల రూపాయాల విలువైన విల్లాలను నిర్మిస్తున్నా ఎసిబికి పిర్యాదులు చేసిన ఇప్పటి వరకు ఒక చూపు చూసిన దాఖాలాలు లేవు.. వైధ్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మరో ఉద్యోగి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మద్యం వ్యాపారంలో ఆరి తెరిపోయారు. జిల్లా కేంద్రంలో బార్ ల నిర్వహణ కాని, లిక్కర్ బిజినేస్ లో అయన పేరు తెలియని వారుండరు. పేరుకు ఉద్యోగం వెలుగ బెడుతున్న ఎన్నడు పీల్డ్ లలో కనపించరని అధికారులను మచ్చిక చేసుకుని వేతనం పొందుతారనే టాక్. తన పేరు మీదనే డైరెక్ట్ గా లిక్కర్ బిజినెస్ లో ఆరితేరిన ఉద్యోగి ఏసీబీకి కనిపించలేదా అన్న చర్చ జరుగుతుంది. వైద్య ఆరోగ్యశాఖలో పని చేస్తున్న మరో ఉద్యోగి విధి నిర్వహణ కన్నా సంఘ సేవకే ప్రాధాన్యత ఇస్తారన్న చర్చ జరుగుతుంది. కానీ ఆయన పెట్రోల్ బంక్ దందాలతో పాటు ఏజెన్సీల నిర్వాహణ ఇటీవల కొత్తగా ఆసుపత్రి యజమన్యం పర్యవేక్షణ చేస్తున్నాడని టాక్ ఉంది. పేరుకు ఉద్యోగి అయిన కోట్ల ఆస్తులు కూడబెట్టిన అవినీతి నిరోదక శాఖ పట్టించుకోలేదా అనే చర్చ కూడా లేకపోలేదు. వైద్య శాఖలో పని చేస్తున్న సూపర్ పోస్టులో ఉన్న ఒకరు ఆటో మొబైల్ రంగంలో కింగ్ పిన్ గా చెలామణి అవుతున్నాడు. అధికారులను బుట్టలో వేసుకుని ఎన్నడు ఫీల్డ్ లో వెళ్లిన దాఖలాలు కనిపించవు. ఇందూర్ లోనే పేరు మోసిన స్పేర్ పార్ట్స్ అమ్మకాలతోనే కోట్లకు పడగలెత్తిన ఇప్పటి వరకు ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎంపీహెచ్ ఏగా పని చేస్తున్న మరో ఉద్యోగి ఉద్యోగం కన్నా ఖద్దర్ పైనే ఎక్కువ మక్కువ చూపుతారని టాక్. ఉద్యోగం వెలుగబెడుతున్న ఇతర దందాలతో తలమూనకలై ఎప్పుడు రాజకీయ నాయకుల నీడలోనే గడుపడం ఆ సార్ కు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. తన సొంత మండలంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేల చెంత చేరి తాను చేస్తున్న దందాల విషయంలో ఇప్పటి వరకు శాఖ నుంచి ఎలాంటి రిమార్కు లేకుండానే పని చేయడం గమనార్హం. వివిధ శాఖలలో ఉద్యోగులు ఉద్యోగంతో పాటు ఇతర దందాలలో ఆరితేరిపోతుంటే తామేమి తక్కువ కాదని ప్రభుత్వ ఉపాధ్యాయులు సత్తా చాటుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఉపాధ్యాయ సంఘం నేత రియాల్ ఎస్టేట్ వెంచర్ లతో పాటు అపార్ట్ మెంట్ల నిర్మాణంలో ఆరితేరారు. ఉపాధ్యాయ సంఘంనేత ట్యాగ్ కలిగి స్కూల్ కు అప్పుడప్పుడు వెళ్లివస్తూ తన దందాలు, బిజినెస్ లతో కోట్లకు పడగలెత్తిన ఏసీబీకి అవి ఆదాయానికి మించిన ఆస్తులుగా కనిపించ లేదా అని చర్చ జరుగుతుంది. మాక్లూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్నఓ ఉపాధ్యాయుడికి పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడమంటే మహాచిరాకు. ఎందుకంటే ఆయనకు వైద్యంలో కీలకమైన ఆయువును అందించే సిలెండర్ల ఏజెన్సీ ఉండడమే కారణం. కరోనా కాలంలో ఆ దందాలో కోట్లకు పడగలెత్తినప్పటికీ ప్రభుత్వం ఇచ్చే నెల వేతనం అంటే చాలా మక్కువ. అందుకే ఏంఈవోలను , కాంప్లెక్స్ హెచ్ ఎంలను మేనేజ్ చేసి స్కూల్ కు వెళ్లకుండానే వేతనం పొందడం గమనార్హం. మోపాల్ మండలంలో పని చేస్తున్న మరో ఉపాధ్యాయుడు విధులకు వెళ్లకుండా తన స్థానంలో విద్యా వాలంటీర్ ను పెట్టి దందాలలో ఆరితేరుతున్నారు. పట్టుమని 50 ఏళ్ళు కూడా లేకుండానే రియల్ ఏస్టేట్ దందాలో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. సరైన పత్రాలు లేని, వారసులు లేని భూములంటే ఆ టీచర్ సార్ కు మక్కువ ఎక్కువ. రవాణా శాఖలో ఎంవిఐగా పని చేస్తున్న ఉద్యోగి రోజువారి ఆదాయం రూ.60 వేలు తగ్గదంటా. సార్ హైదరాబాద్ రోడ్డులోని ఫుడ్ రెస్టారెంట్ లో పెట్టుబడులు పెట్టినట్లు అంతా కోడైకూస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ శాఖలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు చాలా మంది రియల్ ఎస్టేట్ దందాలో తలమునకలయ్యారు. అవినీతి, అక్రమాలలో తమ వాటాగా డబ్బుల బదులు ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకోవడంలో ఆరితేరిపోయారు. పవర్ హౌజ్ కంపౌండ్ లో ఏఈ కంటే పెద్ద పోస్టులో పని చేస్తున్న అధాకారి పైనాన్స్, పెట్రోల్ బంక్ దందాలలో తన అక్రమార్జనను పెట్టుబడి పెట్టాడాని కంపౌండ్ అంతా గుసగుసలుగా చెబుతున్నారు. తాను ఉద్యోగిగా పని చేసే కన్నా ఇతర దందాల ద్వారా నిత్యం కరెన్సీ లెక్కిస్తేనే సార్ ఖుష్ అవాతారని టాక్.