క్రిస్మస్ వేడుకల్లో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
నిజామాబాద్ రూరల్ మండలం ముబారక్ నగర్‌లోని జీసస్ లవ్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన ఎమ్మెల్యే, క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవులకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ మైనార్టీలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం రూ.21 కోట్లు నిధులు కేటాయించింది, రాష్ట్రవ్యాప్తంగా అన్ని చర్చిలకు కలర్ లైటింగ్ కోసం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారని తెలిపారు.ప్రతి చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశామని గుర్తు చేశారు. చర్చి ఫాదర్ ప్రతినిధులు రోడ్డు అవసరం ఉందని కాగానే వెంటనే రోడ్డు పనులు చేపట్టారని చెప్పారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీగా అన్ని మతాలను, అన్ని కులాలు సమానంగా చూస్తుందని ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం క్రిస్టియన్ లను ఎంతగా ఆదరిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే ఆశీర్వాదం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పై గంగారెడ్డి, మైనారిటీ శాఖ చైర్మన్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, చర్చి ఫాదర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

