24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఉత్తమ బ్రాహ్మణ విద్యార్థులకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ 2026 పరీక్షల్లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన నిజామాబాద్‌కు చెందిన బ్రాహ్మణ విద్యార్థిని మదనపల్లి మృధుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కన్న గారి మహేష్ పంతులు కుమార్తె అయిన మృధుల, 1000 మార్కులకు గాను 996 మార్కులు సాధించి రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించడం నిజామాబాద్ జిల్లాకే గర్వకారణమని పలువురు అభినందించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ప్రధాన కార్యదర్శి రమేష్ కులకర్ణి మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన బ్రాహ్మణ విద్యార్థులను సత్కరించడం కొనసాగుతోందని తెలిపారు. విద్యా ప్రోత్సాహంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కే.అనంతరావు (విశ్రాంత అధ్యాపకులు), కే.మధుసూదన్ రావు (రిటైర్డ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్), కే.కృష్ణారావు (రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ), ప్రానేశ్వర్ రావు (రిటైర్డ్ ఎంఈఓ), అశోక్ శర్మ (రిటైర్డ్ ఎంఈఓ), అప్పాల కిష్టయ్య (రిటైర్డ్ హెడ్‌మాస్టర్), అలాగే లక్ష్మీ గణపతి ఆలయ వ్యవస్థాపకులు అరుణ్ కుమార్ శర్మ హాజరై విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు కన్జర్కర్ భూపతి రావు, కోశాధికారి మిలింద్ కుమార్, సహాయ కార్యదర్శి నాలం రమేష్ రావు, ఉపాధ్యక్షులు కొలవి విజయ్ కుమార్, సౌమ్య భరద్వాజ్‌తో పాటు సంఘ సభ్యులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, రత్నాకర్ రావు, రాజకాంత్ రావు కులకర్ణి, మదన్ దీక్షితులు, పుల్కల్ రమేష్, కోస్లీ చంద్రశేఖర్, మల్లికార్జున్ రావు, జయంత్ రావు, లక్ష్మీకాంత్ రావు, దామోదర్ రావు, అర్చన తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article