ఉత్తమ బ్రాహ్మణ విద్యార్థులకు సన్మానం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ 2026 పరీక్షల్లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన బ్రాహ్మణ విద్యార్థులకు ఆదివారం ప్రతిభా పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయిలో తొలి ర్యాంకు సాధించిన నిజామాబాద్‌కు చెందిన బ్రాహ్మణ విద్యార్థిని మదనపల్లి మృధుల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అక్కన్న గారి మహేష్ పంతులు కుమార్తె అయిన మృధుల, 1000 మార్కులకు గాను 996...