27.3 C
Hyderabad

బాసర ఐఐఐటీలో సీటు సాధించిన విద్యార్థినికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన కార్మికురాలు అయినటువంటి చుంచు స్వరూప- శ్రీనివాస్ ల కుమార్తె చుంచు సాహితీ బాసర ఐఐఐటీలో సీటు సాధించిన సందర్భంగా శుక్రవారం మండల విద్యాధికారి కట్ట శ్రీనివాస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్ రామ్ సింగ్, పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థి సాహితిని శాలువాతో సన్మానించారు. సాహితి ఐఐఐటీలో సీటు సాధించిన సందర్బంగా మధ్యాహ్న భోజన కార్మికురాలు చుంచు స్వరూప   పాఠశాల విద్యార్థులకు  మధ్యాహ్న భోజనంలో చికెన్, బిర్యాని వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనోజ్,    లక్ష్మీనరసయ్య, షేక్ అక్బర్  గోని శంకర్, ఎన్.సంజీవ్, విజయ చక్రవర్తి, విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article