28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షునికి సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల;మోర్తాడ్ మండలంలో ఎస్ జి టి గా విధులు నిర్వహించిన మగ్గిడి ప్రవీణ్,ఇటీవల స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) హోదాలో పదోన్నతి పొంది ఏర్గట్ల మండలంలోని జడ్పీహెచ్ఎస్ తొర్తి పాఠశాలకు బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా పి ఆర్ టి యుఏర్గట్ల మండల కార్యవర్గం తరఫున ప్రమోషన్ పొందిన సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మోర్తాడ్ మండలంలో పి ఆర్ టి యు సంఘానికి చేసిన సేవలకు గాను గుర్తింపు గా ఏర్గట్ల మండలం లో వారికి గౌరవంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగిస్తూ పి ఆర్ టి యు ఏర్గట్ల కార్యవర్గం శాలువా తో  సత్కరించడం జరిగింది. ఇట్టి సందర్భంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షుడు కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మోర్తాడ్ మండలంలో విధులు నిర్వహించిన ప్రవీణ్ ఇప్పుడు ఏర్గట్ల మండలంలో చేరడం సంతోషకరం.సంఘపరంగా ఆయనతో కలిసి మరింత సమన్వయంతో ముందుకు సాగుదామని భావిస్తు సంఘ పరంగా తను చేసిన సేవలకు గుర్తింపుగా, జిల్లాశాఖ  ఆధ్వర్యంలో పదవిని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మగ్గిడి ప్రవీణ్ మాట్లాడుతూ చాలా సంవత్సరాల నుండి కళ గా ఉన్న ప్రమోషన్ వచ్చిన శుభ సందర్భంగా పిల్లల ఉన్నత వికాసానికి కృషి చేస్తూ వారి ఉజ్వల భవిష్యత్తు కి పాటు పడుతానని అలాగే సంఘంపరంగా గౌరవంగా ఇచ్చిన రాష్ట్ర అసోసియేట్ అధ్యక్ష బాధ్యతను పెద్దన్న పాత్ర పోషిస్తూ సమర్థంగా నిర్వర్తిస్తూ,సంఘం అభివృద్ధికి ఉపాధ్యాయుల ఐక్యతకు నడుం బిగిస్తానని  ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కృష్ణ ప్రసాద్,రాజశేఖర్ మరియు రాష్ట్ర,జిల్లా , మండల కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జిల్లా శాఖ కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మండల ప్రధాన కార్యదర్శి గాండ్ల రాజశేఖర్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు దశెంధర్, గటాడి భాస్కర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి రాజేందర్ జిల్లా కార్యదర్శి సాదుల గంగాధర్ మండల అసోసియేట్ అధ్యక్షులు మైసాల సుధాకర్, మండల కార్యదర్శి ఇమాముద్దీన్ తొర్థి ఉన్నత పాఠశాల ప్రైమరీ పాఠశాల ల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

More articles

Latest article