30.2 C
Hyderabad

28న కామారెడ్డి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

Must read

📰 Generate e-Paper Clip

 

కామారెడ్డి, బతుకమ్మ :

భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న కామారెడ్డి జిల్లాలో గురువారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్. రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు జన జీవనం అస్థవ్యస్థం కావడంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ తీవ్ర ఇబ్బందుల నేపథ్యం, వాగులు, వంకలు, చెరువులు పొంగి ప్రవహిస్తున్న  కారణంగా జిల్లాలో అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో పరీక్షలు వాయిదా…

ఉమ్మడి జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా  తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 28 న జరగాల్సిన పీజీ/బీఎడ్/ ఎమ్మేడ్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి  ప్రొఫెసర్ కే సంపత్ కుమార్  ఒక ప్రకటనలో తెలిపారు. మిగిలిన పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని,వాయిదా పడిన పరీక్ష తేదీని  తదుపరి ప్రకటిస్తామని తెలిపారు.

More articles

Latest article