23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

హిట్ అండ్ రన్ బీఎన్ఎస్ సెక్షన్ రద్దు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్టారి రాములు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రాన్స్ పోర్ట్ కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ బీఎన్ఎస్ సెక్షన్ 106(1)(2)  రద్దు చేయాలని దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్టారి రాములు ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ రోడ్ ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన హిట్ అండ్ రన్ బీఎన్ఎస్ సెక్షన్ 106 (1(2) లను రద్దు చేయాలని కటారి రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రోడ్ ప్రమాదాలు జరగడానికి డ్రైవర్ లే కారణమని భావించి డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలని 10  సంవత్సరాలు జైలు శిక్ష , ఏడు లక్ష రూపాయల ఫైన్ విధించే విధంగా తీసుకొచ్చిన సెక్షన్ ని  రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రవాణా రంగ  కార్మికులు నిత్యం ప్రమాదాలకు గురౌతున్నారని,కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని  కార్మికులను అదుకోవడం కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ ముజీబ్, టి.కృష్ణ, ఇమ్రాన్ ఖాన్, మల్లేష్, అనీష్, కిషన్, రఫీయుద్దీన్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.

More articles

Latest article