హిట్ అండ్ రన్ బీఎన్ఎస్ సెక్షన్ రద్దు చేయాలి
ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్టారి రాములు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ట్రాన్స్ పోర్ట్ కార్మికులను కఠినంగా శిక్షించే హిట్ అండ్ రన్ బీఎన్ఎస్ సెక్షన్ 106(1)(2) రద్దు చేయాలని దేశవ్యాపిత సమ్మెలో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కట్టారి రాములు ఆధ్వర్యంలో ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు కటారి రాములు మాట్లాడుతూ రోడ్ ప్రమాదాలు తగ్గాలంటే డ్రైవర్ లను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశంతో కేంద్ర...