29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హిందువులు ఐక్యమత్యంగా ముందుకు సాగాలి

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హిందువులు ఐక్యమత్యంగా ముందుకు సాగాలని, భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం హిందూ ధర్మం అని 108 సద్గురు మహాదేవ స్వామిజీ అన్నారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో హిందూ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా 108 సద్గురు మహాదేవ స్వామిజీ (గుడిమెట్ల పీఠాధిపతి) హాజరయ్యారు. బస్టాండ్ ప్రాంగణంలోని చత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుండి శశిరేఖ గార్డెన్ ఫంక్షన్ హాల్ వరకు హిందువులు ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మహదేవ స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మం విశిష్టతను ప్రతి భారతీయుడు తెలుసుకోవాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని పేర్కొన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, సాంప్రదాయ ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ సనాతన ధర్మం ప్రతిరూపమే హిందూ సమ్మేళనం అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ధర్మం వైపు మొగ్గు చూపాలన్నారు. అదే విధంగా హిందూ సనాతన ధర్మాలను, వాటి ప్రాముఖ్యాన్ని వివరించారు. ఈ సందర్బంగా చిన్నారులు వేసిన కూచిపూడి నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బెజుగం వెంకటేశ్వర్ గుప్తా, ప్రధాన వక్తలు నర్రా వెంకట శివకుమార్, పెద్దలు, హిందూ సంఘాల నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article