రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండలంలోని రాయకూర్ గ్రామంలో ఈ నెల 27న (సోమవారం) నిర్వహించనున్న ‘హిందూ సమ్మేళనం’ వాల్ పోస్టర్లను మంగళవారం సులేమాన్ నగర్, చిక్కడపల్లి గ్రామాల్లో హిందూ సంఘాల నాయకులు విడుదల చేశారు. ఈ సమ్మేళనంలో మల్లారం పీఠాధిపతి బాలయోగి కృష్ణ మహారాజ్ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. హిందూ సోదరులందరూ ఈ వేడుకకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి సర్పంచ్ మచ్కురి రమేష్, సుధాకర్ గౌడ్, అనీల్ పటేల్, యువకులు తదితరులు పాల్గొన్నారు.
