31.2 C
Hyderabad

పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

మండల కేంద్రంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి మంగళవారం పలువురు ఆత్మీయ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఏర్గట్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బద్దం లింగారెడ్డి తండ్రి బద్దం గంగారెడ్డి ని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఏర్గట్ల గ్రామ వాస్తవ్యుడు దోబ్బల శంకర్ మృతి చెందిన విషయం తెలియడంతో వారి నివాసానికి వెళ్లి వారి కుమారులు రాజేందర్, రమేష్, రవి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో రెండ్ల రమేష్, కమ్మర్ పల్లి మార్కెట్ కమిటీ సభ్యులు కోరి పెళ్లి లింగారెడ్డి, నాగేంద్ర నగర్ సర్పంచ్ రంజిత్, ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రెసిడెంట్ ఎండీ మునీర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రోక్కెడ సంజీవ్, దొబ్బల మహేష్, లూనా సాయన్న, జంగల గణేష్, శాంసన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

 

Manala visited several victim families

More articles

Latest article