29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . హిందూ సమ్మేళన కరపత్రాల ఆవిష్కరణలో ఉసెం రమేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఏప్రిల్ 21 న శ్రీరామ గార్డెన్ లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు ఉసెం రమేష్ రెడ్డి అన్నారు. నీలకంఠేశ్వర బస్తీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హిందూ సమ్మేళనం కరపత్రాలను ఉసెం రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అశోక టౌన్ షిప్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వీధి వీధిలో జరుగుతున్న హిందూ సమ్మేళనాలకు కోట్లాదిమంది హిందువులు హాజరవుతున్నారని అందులో భాగంగా మన నీలకంఠ బస్తీలో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళనానికి రిలయన్స్ మాల్ నుండి పృథ్వి అపార్ట్మెంట్ మధ్య గల ప్రాంతాలలో నివసిస్తున్న హిందువులందరూ కుటుంబ సమేతంగా హాజరుకావాలని ఆయన ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి గంగుల అశోక్, కోశాధికారి భాగవత పురుషోత్తం శర్మ, కార్యవర్గ సభ్యులు భూమేశ్వర్, చంద్రమోహన్, నాగేశ్వర్ రావు, మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Hindu Sammelan should be made successful.

More articles

Latest article