మన సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపమే హిందూ పండుగలని పల్నాటి కార్తీక్ అన్నారు. మకర సంక్రాంతి సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తీక్ కుమార్ 25వ డివిజన్ లో చిన్నారులందరికీ పతంగులు పంచడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రైతులందరు సంతోషంగా భోగి, సంక్రాతి, కనుమ గా మూడు రోజులు చిన్న, పెద్ద అందరు కలిసి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. సంక్రాతి అంటేనే చిన్న, పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగరావేస్తారని, ముఖ్యంగా పతంగులు...