. . . స్టే విధించిన ఉన్నత న్యాయస్థానం
. . . కేసీఆర్, హరీష్, స్మితా సభర్వాల్ లకు ఉరట
హైదరాబాద్, బతుకమ్మ:
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పిపీ ఘోష్ కమిషన్ తుది నివేదిక పై చర్యలకు హైకోర్టు బ్రేకులు వేసింది. జస్టీస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీయం మోహియుద్దీన్ ల ధర్మాసనం కాళేశ్వరం ఎత్తిపోతల కమీషన్ ఏర్పాటు ను స్వాగతించింది. నివేదిక తయారు చేసే విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించకపోవడం దాని చర్యల పై స్టే విధించింది. ఈ మేరకు ధర్మాసనం బుధవారం బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి లతో పాటు అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్ ల విషయంలో వారందరికీ ఉరట నిస్తు తీర్పు వెలువరించింది. సమాజంలో పలుకుబడి కలిగిన వారికి సెక్షన్ 8 కింద నోటీసులు ఇవ్వకుండా నిరాధార ఆరోపణలు చేయవద్ధని తెలిపింది. జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్ల పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇద్దరు న్యాయమూర్తుల స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు…
. . . పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ కుట్రలకు చెంపపెట్టు…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు స్టేను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందన్నారు. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పని చేయాలి అని సూచించారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, ముమ్మాటికీ పీసీసీ ( పిసీసీ) నివేదికని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతున్న మాట ఇవాళ అక్షరాలా నిజమని తేలిపోయింది అన్నారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి కి హైకోర్టు తీర్పు ఒక గట్టి చెంపపెట్టు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. భారత రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా దేశంలో గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని స్పష్టం చేశారు.
