ప్రభుత్వ పాఠశాలకు చేయూత

0 7,201

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ప్రభుత్వ పాఠశాలకు యువతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేయూతనిచ్చారు. ఇటీవల వర్షాలకు చెరువు తెగి పోయి వాడి ప్రభుత్వ పాఠశాలలోకి వరద నీరు వచ్చి చేరింది.  దీంతో   సామగ్రి తడిచి పనికి రాకుండాపోయింది.  మా పాఠశాలను మేము రక్షించుకుంటాం అనే ఆలోచనతో యువతరం యూత్ అసోసియేషన్ పాఠశాల బాగు కోసం ముందుకొచ్చింది. వీడీసీ చైర్మన్ జిన్నా సాయిలు ఆధ్వర్యంలో యూత్ అధ్యక్షులు పడకంటి మహేందర్ తో పాటు సభ్యులు సోమవారం రూ.10 వేలు ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్ కు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడం కోసం పూర్వ విద్యార్థుల తరుపున నిధులు కేటాయించి బాగు చేసుకున్నామని పడకంటి మహేందర్ పేర్కొన్నారు.  మా తరుపున ఎలాంటి సహాయం అవసరమయిన  సభ్యుల సహకారంతో చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఈ సందర్భంగా యువతరం యూత్ అసోసియేషన్ కు  వీడీసీ చైర్మన్ జిన్నా సాయిలు, ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్, శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీడీసీ సభ్యులు
గంగారం, సంతోష్, యూత్ సభ్యులు నవీన్, శ్రీకాంత్, రుతిక్, నవీన్, సృజన్, రమేష్, బాల్ రాజ్ పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.