నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హలో మాదిగ ఛలో కామారెడ్డి కార్యక్రమాన్ని ఈనెల 28న మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ కామారెడ్డి లో నిర్వహిస్తున్నట్లు ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు సరికెల పోశెట్టి మాదిగ తెలిపారు. కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ముఖ్యఅతిథిగా హాజరవన్నట్లు ఆయన వెల్లడించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాలని ఉద్యమ కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 25 నుండి 30 వరకు మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభలు, నవంబర్ 4 నుండి 14 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గ కేంద్రాలలో, అన్ని మండల కేంద్రాలలో మాదిగల ధర్మ యుద్ధ దిక్షలు, నవంబర్ 16న దండోరా ధర్మ యుద్ధ రథయాత్ర కోదాడ నుండి మొదలవుతుందని, అలాగే డిసెంబర్ 21న చలో హైదరాబాద్ మాదిగల ధర్మ యుద్ధ మహా ప్రదర్శన నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రంలో అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వైఖరి నిరసిస్తూ ఈ నెల 28న ఉమ్మడి జిల్లా మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని రెండు జిల్లాల మాదిగలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు సరికేల పొశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షలు ఆకారం రమేష్, టౌన్ అధ్యక్షులు పెద్దగారి మహేష్, మహిళా నాయకులు. యమున. పద్మ. సత్యక, మాదారపు రాములు, ఎం ఎస్ ఎఫ్ నాయకులు హరిదాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.