28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఇందూర్ లో దంచికొట్టిన వాన

Must read

📰 Generate e-Paper Clip

  • తెగిపోయిన ముత్యాలమ్మ చెరువు
  • నీటమునిగిన బీరప్ప తాండ, నడిమితాండ, వాడి గ్రామాలు
  • మహారాష్ట్రకు రాకపోకలు బంద్
  • మంజిరా, గోదావరి నదుల ఉదృతి
  • నీటమునిగిన వేలాది ఎకరాల పంటలు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో వాన దంచికొట్టింది. వినాయకచవితి పండుగ నాడు బుధవారం ప్రారంభమైన వాన గురువారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో అత్యధికంగా 27 సెం.మీ, అదే విధంగా భీంగల్, ఇందల్వాయి, ధర్పల్లి, చందూర్, డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్ పల్లిలో భారీ వర్షం కురిసింది. గోదావరి, మంజిరా నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. కందకుర్తి వద్ద గోదావరి, సాలురా వద్ద మంజిరా నదులు ఉగ్రరూపం దాల్చాయి. మంజిరా నది వద్ద సాలురా బ్రిడ్జి నీటి కారణంగా మునగడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచిపోయాయి.

Heavy rains in Indore

భారీ వర్షాల వల్ల జిల్లాలోని పలు ప్రాంతాలలో చెరువులు,వాగులు తెగిపోయి రోడ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిరికొండ, ధర్పల్లి,భీంగల్,ఇందల్వాయి మండలాల్లోని కొండాపూర్, తూంపల్లి, గడ్కోల్,ముషీర్ నగర్, హోన్నాజీపేట్,వాడి,నడిమితండా,బెజ్జోరా,సిర్నాపల్లి గ్రామాలు వరద తాకిడికి గురయ్యాయి. మూడు చెరువులు తెగిపోగా,సుమారు 12,413 ఎకరాలలో ఇసుక మేటలు వేయడం, నీట మునగడం వల్ల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. వరద నీటి ప్రవాహం తగ్గిన మీదట పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. 13 చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతినగా, 29 చోట్ల ఆర్ అండ్ బీ రోడ్లకు నష్టం జరిగింది. వర్షానికి ఒక నివాస గృహం పూర్తిగా కూలిపోయిందని,మరో ఆరు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. 60 కరెంటు స్తంభాలు,మరో 60 కండక్టర్లు పడిపోగా,కొన్ని చోట్ల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లు నీట మునిగాయి. వరద ప్రవాహం వల్ల ఎనిమిది

Heavy rains in Indore

గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, తక్షణమే పునరుద్ధరించారు.ధర్పల్లి మండలం వాడి గ్రామంలో ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాన్ని పంపడంతో పాటు,రూరల్ శాసన సభ్యులు భూపతి రెడ్డి,పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి తాను స్వయంగా గ్రామాన్ని సందర్శించి ముంపు పరిస్థితిని పర్యవేక్షించారు.  నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జిల్లాలో భారీ వర్షాభావ పరిస్థితులపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ లో ఆరా తీసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి అధికారులతో సమన్వయం చేశారు.

Heavy rains in Indore

  • వరద బాధితులకు పునరావాసం..

వరద  ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం చందూర్,ధర్పల్లి,డిచ్పల్లి,నిజామాబాద్ రూరల్,జక్రాన్పల్లి మండలాల్లో 7 పునరావాస కేంద్రాలను నెలకొల్పి, అవసరమైన ఆహార పదార్థాలు,తాగునీరు,ఇతర సదుపాయాలు కల్పించింది యంత్రాంగం.164 కుటుంబాలకు చెందిన 358 మంది ఈ శిబిరాలలో ఆశ్రయం పొందుతున్నారు. జిల్లలో ఎక్కడ కూడా ప్రాణనష్టం సంభవించలేదు.వరద నీటిలో చిక్కుకుపోయిన 17 మందిని సురక్షితంగా కాపాడారు. కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో భీంగల్ ఎక్సైజ్ కార్యాలయంలో చిక్కుకున్న ఇద్దరిని అగ్నిమాపక శాఖ బృందం రెస్క్యూ చేసింది. బెజ్జోర వద్ద ఆటోలో వెళ్తున్న ఆరుగురిని జేసీబీ సహాయంతో కాపాడడం జరిగిందని,ఇందల్వాయి మండల దోన్కల్ లో ఫాంహౌస్ లో చిక్కుకుపోయిన వ్యక్తిని, ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద 8 మందిని కాపాడారు. కామారెడ్డి రామాయంపేట మధ్య హైదరాబాద్ కు వెళ్ళే మార్గంలో వరద నీటి ప్రవాహం వల్ల వాహనాలు ముందుకు వెళ్ళే పరిస్థితి లేక ట్రాఫిక్ స్తంభించిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడ్,ముప్కాల్,బాల్కొండ ప్రాంతాల వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిపి నిరీక్షిస్తున్న లారీల డ్రైవర్లకు 600 వరకు ఫుడ్ ప్యాకెట్లను ఉచితంగా అందజేశారు. మరో 48 గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,చెరువులు,వాగులు,కుంటల వద్దకు వెళ్లవద్దని హితవు పలికారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు,ఈత సరదా కోసం పిల్లలు,యువత చెరువులు, వాగులోకి దిగకూడదని జిల్లా కలెక్టర్ సూచించారు.

Heavy rains in Indore

More articles

Latest article