ఇందూర్ లో దంచికొట్టిన వాన
తెగిపోయిన ముత్యాలమ్మ చెరువు నీటమునిగిన బీరప్ప తాండ, నడిమితాండ, వాడి గ్రామాలు మహారాష్ట్రకు రాకపోకలు బంద్ మంజిరా, గోదావరి నదుల ఉదృతి నీటమునిగిన వేలాది ఎకరాల పంటలు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో వాన దంచికొట్టింది. వినాయకచవితి పండుగ నాడు బుధవారం ప్రారంభమైన వాన గురువారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసింది. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండలో అత్యధికంగా 27 సెం.మీ, అదే విధంగా భీంగల్, ఇందల్వాయి, ధర్పల్లి, చందూర్, డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్, జక్రాన్ పల్లిలో భారీ వర్షం...