- ఆరోగ్యమేళాలో 154 మందికి వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రత్యేక వైద్యులు
ధర్పల్లి, బతుకమ్మ: గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యులచే ప్రతినెల రెండవ శనివారం ఆరోగ్య మేళా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ….. జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మహిళల ప్రత్యేక వైద్యురాలు డాక్టర్.సుభంగీ,చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్. నరేష్ కుమార్ లచే ఆరోగ్యమేళా నిర్వహించడం జరిగింది. ఈ ఆరోగ్యమేళాకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఇందులో స్త్రీ సంబంధిత రోగులు 61 , చర్మ వ్యాధి సంబంధిత వ్యాధుల రోగులు 37, సాధారణ రోగులు 56 కలిపి మొత్తం 154 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి రక్త నమూనాలను సేకరించి, వారికి కావాల్సిన మందులను ఉచితంగా ఇచ్చి తగిన సలహాలు ఇచ్చారు, ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది ఉంటే నిజామాబాద్ జనరల్ హాస్పిటల్ కి వచ్చి చూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మౌనిక, డాక్టర్ సుభంగీ,డాక్టర్ నరేష్ కుమార్,సిబ్బంది,కృష్ణ,మురళి,సంతోష్, వాజీద్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.