సర్వీస్ రూల్స్ ప్రమోషన్ల కోసం హెడ్‌మాస్టర్ల ధర్నా
హైదరాబాద్, బతుకమ్మ: హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ గెజిటెడ్ హెడ్‌మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెడ్‌మాస్టర్లు ధర్నా నిర్వహించారు. తమ దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా ప్రధానోపాధ్యాయులు శనివారం హైదరబాద్ లో ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోహన్ ,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సురేష్ నాయకులు మాట్లాడుతూ, హెడ్‌మాస్టర్లకు స్పష్టమైన సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పదోన్నతుల్లో ఉన్న అసమానతలు తొలగించి,...