- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్
కామారెడ్డి, బతుకమ్మ : 40 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ క్రమం తప్పకుండా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా ప్రజలకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. ముందుగా సదరం బిల్డింగ్ ను సందర్శించి ఈ బిల్డింగ్ రిపేరింగ్ పనులు పరిశీలించి సౌకర్యవంతంగా ఉండేలా మరియు సుందరంగా కనబడేలా మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా సదరం వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, విద్యుత్ లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్ తదితర అన్ని సమకూర్చుకోవాలని ఆస్పత్రి సూపరింటిండెంట్ సూచించారు. మున్సిపల్ కమిషనర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు వైద్య పరీక్షల నిమిత్తం నిర్వహిస్తున్న ప్రత్యేక ఆరోగ్య శిబిరంను సందర్శించి శిబిరంలో మహిళకు అందిస్తున్న వైద్య పరీక్షలను పరిశీలించడం జరిగింది. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి అందరూ కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని చూచించారు. ఇట్టి ఆరోగ్య శిబిరంలో 86 మంది మహిళలకు వైద్య మరియు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మధ్య వయసులో అనేక కారణాల వలన మనుషులకు కొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంటదని అలాంటి వ్యాధులను ముందే గుర్తించి చికిత్స చేయడం వలన అనేక ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు కాబట్టి 40 సంవత్సరాలు పైబడిన వారు అందరూ తప్పనిసరిగా సాధారణ ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్ , జనరల్ సర్జన్( శస్త్ర చికిత్సా నిపుణులు), ఆర్థోపెడిక్ ( ఎముకల వైద్య నిపుణులు ), ఆప్తాల్మిక్ ( కంటి వైద్య నిపుణులు),ఈ.ఎన్. టి.(చెవి,ముక్కు గొంతు వైద్య నిపుణులు) గైనిక్ విభాగము ( స్త్రీ వైద్య నిపుణులు ) తదితర విభాగాల వైద్య నిపుణులు ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరియు చికిత్సలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ చందర్, అడిషనల్ డి.ఎం.ఈ. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి మరియు ఆర్ .ఎం. ఓ. లు , వైద్యులు , నర్సింగ్ సూపరింటెండెంట్ , నర్సింగ్ సిబ్బంది , ఇతర సిబ్బంది పాల్గోన్నారు.

