క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ కామారెడ్డి, బతుకమ్మ : 40 సంవత్సరాల వయసు పైబడిన వారందరూ క్రమం తప్పకుండా సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ జిల్లా ప్రజలకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని సందర్శించారు. ముందుగా సదరం బిల్డింగ్ ను సందర్శించి ఈ బిల్డింగ్ రిపేరింగ్ పనులు పరిశీలించి సౌకర్యవంతంగా ఉండేలా మరియు సుందరంగా కనబడేలా మరమ్మతులు చేయించాలని, అదేవిధంగా సదరం వైద్య పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాలు, విద్యుత్...