26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఆదివారం కందకుర్తి కి హర్యానా గవర్నర్ రాక

Must read

📰 Generate e-Paper Clip

 

 నవీపేట్ , బతుకమ్మ  :

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం  రెంజల్ మండలం కందకుర్తి లోని త్రివేణి సంగమం వద్ద గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మ్యాక సంతోష్ తెలిపారు. బండారు దత్తాత్రేయ హైదరాబాద్ నుండి ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు త్రివేణి సంగమం పుష్కర ఘాట్ వద్ద చేరుకొని గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొంటారని, తదనంతరం డాక్టర్ జీ హెగ్డేవార్ పూర్వీకుల స్థలంలో నిర్మిస్తున్న డా.కేశవరాం, బలిరాం హెగ్డేవార్ స్ఫూర్తి కేంద్రం పనులను పరిశీలిస్తారని తెలిపారు. ఆర్ఆర్ఎస్ శతవసంతోత్సవాలను జరుపుకుంటున్న వేళ హర్యానా గవర్నర్ పర్యటన జరుగడం విశేషం.

More articles

Latest article