28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఏటీఎంలను కొల్లగొట్టే హర్యానా గ్యాంగ్  అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రెండు కార్లు… దోపిడికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగర ఒకటో టౌన్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా వారికి అనుమానస్పదంగా కారులో రాడ్లు, కర్రలు, గ్యాస్ కట్టర్ లతో తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా ఎటిఎం లను కొల్లగొట్టే గ్యాంగ్ గా గుర్తించినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. శుక్రవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సిపీ మాట్లాడుతూ….. గత నెల 31న నగరంలోని ఖలీల్ వాడి లో గల పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం లో కొందరు వ్యక్తులు గ్యాస్ కట్టర్ ద్వార ధ్వంసం చేసి  చోరికి యత్నించగా అప్పుడే బ్లూ కోట్ సిబ్బంది రాగా పరారీ అయ్యారు. సీసీ పుటేజీ ఆధారంగా ఎటిఎంలో చోరీ ముఠా పట్టుకునేందుకు ప్రత్యేక టీం రంగంలోకి దించారు. ఈ నెల 8న నిఖిల్ సాయి చౌరస్తాలో ఒక కారులో అనుమానస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం చోరికి యత్నించాడు గ్యాంగ్ గా విచారణ ఒప్పుకున్నారు. వారు హర్యానా లోని నుహ జిల్లా పున్హనా తాలుకా, బడ్లి గ్రామానికి చెందిన అబ్దుల్లా ఖాన్, ముంబాయిలోని అందేరి వేస్ట్ కు చెందిన మహ్మద్ అన్సారీ, హర్యానాలోని నుహ జిల్లా బాదన్ గాకకు చెందిన వాజీద్ ఖాన్,  ఇదే జిల్లా మెవాత్ కు చెందిన హమ్మద్ అజీబ్ అలియాస్ నత్తు, పల్వాల జిల్లా అతీం తాలుకా కిలోకా గ్రామానికి చెందిన శామోద్ధిన్ అలియాస్ ఇక్రామ్ లను అరెస్ట్ చేశారు.  హర్యానాకు చెందిన అబ్దుల్లా గ్యాంగ్ 2018లో  ఉధయ పుర ఎటిఎంలో  లక్షలు కొల్లగొట్టారు. శివపురిలో 8 లక్షలు దోచారు. అప్పుడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపగా అక్కడ హైదరాబాద్ లో నివాసం ఉంటున్న పోక్సో కేసులో అమీర్ కు జైలు లో నలుగురు సభ్యులు పరిచయం అయ్యారు. వారు ఐదుగురు కలిసి తెలంగాణలో ఎటిఎంలు కొల్లగొట్టాలని పధకం వేశారు. గత ఏడాది జులైలో షాపూర్ నగర్ లో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ ఎటిఎం కొల్లగొట్టి 30 లక్షలు దోచుకున్నారు. జహిరాబాద్ లో సాంత్రో కారు చోరి చేసి అందులో ప్రయాణిస్తూ టోల్ ప్లాజ వద్ధ ఎటిఎం చివరికి యత్నించి విఫలమయ్యారు. తర్వాత దొంగిలించిన బ్యాలెనో కార్ లో నగరానికి వచ్చి ఖలీల్ వాడి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎటిఎం చివరికి వచ్చి బ్లూ కోట్ సిబ్బంది చూసి పరారీ అయ్యారు. అర్గుల్ వద్ధ ఎటిఎం చోరికి యత్నించగా అలారం మోగడం తో పారిపోయారు. వారిని ఐదుగురిని అరెస్టు చేసి ఒక బోలేరో, ఒక బ్యాలెనో కార్ తో పాటు  సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన నిజామాబాద్ ఎసిపీ రాజా వెంకట్ రెడ్డి, నగరం ఒకటవ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి సిబ్బంది సీపి సాయి చైతన్య అభినంధించారు.

Haryana gang involved in ATM robbery arrested

More articles

Latest article