ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రైతుల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆరోపిస్తూ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు ఆదేశాల మేరకు టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ నేతృత్వంలో ఎల్లారెడ్డి డివిజన్ తహసీల్దార్ కార్యాలయం ప్రధాన రహదారిపై సుమారు 300 మంది రైతులు, పార్టీ కార్యకర్తలతో భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మాట్లాడుతూ రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఇప్పటివరకు పూర్తి కాలేదన్నారు. మహాలక్ష్మి పథకం మహిళలకు అందలేదని, తులం బంగారం ఇవ్వలేదు ఇప్పటికీ ఇవ్వడం లేదన్నారు.గ్యాస్ సబ్సిడీ హామీ మాటలకే పరిమితమైందని,ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మాత్రమే అమలు మాత్రం శూన్యం అని విమర్శించారు.అదే విధంగా ఎల్లారెడ్డిలో ఐదు కోట్ల రూపాయలతో బస్టాండ్ నిర్మాణం ప్రారంభించామని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించిన ఆయనహాస్పిటల్ ప్రారంభించింది మేమేనని, మినీ ట్యాంక్ బండ్ నిర్మించింది మేమేనని,అయినా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోంది అని మండిపడ్డారు.ఫ్రీ బస్సు పథకం పేరుతో చిన్నచిన్న వ్యాపారుల జీవనాధారంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లింగంపేట్ మండల్‌లో కాంగ్రెస్ సర్పంచుల సమావేశంపై తీవ్ర విమర్శించారు.రైతుల సమస్యలు పరిష్కరించే వరకు టీఆర్‌ఎస్ పార్టీ పోరాటం ఆగదని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
