29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పశుసంవర్ధక శాఖలో వేధింపులు

Must read

📰 Generate e-Paper Clip

  • జూనియర్ అసిస్టెంట్ కు తప్పని తిప్పలు
  • చర్యలకు బదులు డిప్యూటేషన్ తో సరిపెట్టిన అధికారులు
  • వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరి రిలీవ్

 

నిజామాబాద్, బతుకమ్మ : పశుసంవర్ధక శాఖలో జూనియర్ అసిస్టెంట్ ను ఇద్దరు అధికారులు వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని  ఒక సీనియర్ అధికారి మరొక సీనియర్ సిబ్బంది వేధించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు పశు సంవర్ధక శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. దానిపై విచారణ చేసిన అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా డిప్యూటేషన్ పై పంపడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో అధికారులు చర్య తీసుకోకపోవడంతో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జోక్యంతోనే వారిపై వేటు వేయకుండా కేవలం ఇద్దరినీ వరంగల్ కు డిప్యూటేషన్ పై పంపుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న జీవోఎం కీర్తి కుమార్, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మణరావు లను వరంగల్ కు డిప్యూటేషన్ పై పంపుతూ వచ్చిన ఉత్తర్వుల మేరకు రిలీవ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహిళ ఉద్యోగిని పట్ల జరిగిన వేధింపులపై ఉద్యోగ సంఘాలు సైలెన్స్ వెనుక ఆంతర్యం ఏమిటని చర్చ జరుగుతుంది. అధికారులు కూడా బాధ్యులని గుర్తించినప్పుడు చర్యలు తీసుకోకుండా ఏ విధంగా డిప్యూటేషన్ పై పంపుతారని వెటర్నరీ శాఖలో చర్చ మొదలైంది. డిప్యూటేషన్ తాత్కాలికమేనని వారు తిరిగి సొంత జిల్లా నిజామాబాద్ కు వస్తారని ఉద్యోగ వర్గాలు అంత కోడై కూస్తున్నాయి.

More articles

Latest article