- సీనియర్ న్యాయవాది ఎం.లక్ష్మణ్ రావు
బతుకమ్మ, బిచ్కుంద : అంతర్జాతీయ న్యాయ దినోత్సవం పురస్కరించుకొని న్యాయమూర్తులకు, తోటి న్యాయవాదులకు సీనియర్ అడ్వకేట్ లక్ష్మణ్ రావు అంతర్జాతీయ న్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కలిగేలా పనిచేయాలని అన్నారు. న్యాయవ్యవస్థ జోడెడ్ల బండి లాంటిదని న్యాయమూర్తులు, న్యాయవాదులు సమన్వయంతో నడిస్తేనే కక్షిదారులకు సరైన న్యాయం జరుగుతుందన్నారు. న్యాయవాదులు అనవసర వాయిదాలు పోకుండా కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు.