నిజామాబాద్, బతుకమ్మ : రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(RSP) ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల ప్రధాన రహదారి వద్ద నిరసన తెలిపారు. ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు మాట్లాడుతూ నగరంలోని వర్ని చౌరస్తా నుంచి నాగారం వరకు బాన్సువాడ వెళ్లే మార్గంలో రోడ్లు అన్ని గుంతల మయంగా మార యాన్నారు. జూపల్లి కృష్ణారావు సమక్షంలో గత సంవత్సరం శిలాఫలకం వేసి 450 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తామంటూ హంగు ఆర్భాటం చేసిన కేవలం శిలఫలకానీకే పరిమితమైందని విమర్శించారు ప్రధాన రోడ్లు గుంతలమయం కావడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు గుంతలుగా ఉన్న రోడ్లపై డస్ట్ బూడిద వేయడంతో టిప్పర్ లారీల కారణంగా పెద్ద ఎత్తున దుమ్ము చెలరేగడంతో వెనకాల ఉండే ద్విచక్ర వాహనాలకు ముందున్న వాహనాలు కనపడకపోవడంతో బైకులు జారిపడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నగరంలోని రాజ రాజేంద్ర చౌరస్తా నుంచి ఫులాంగ్ వరకు వెళ్లే రోడ్డు మరియు గాయత్రి నగర్, సాయి నగర్ మరియు రిలయన్స్ నుండి ప్రెసిడెన్సి స్కూల్ కు వెళ్లే రూటులో ఖిల్లా చౌరస్తా ఈ రోడ్లన్నీ గుంతలమయంగా మారయాన్నారు. ప్రభుత్వం నూతన రోడ్లు వేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రోడ్లన్నీ దిగ్బంధం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏఐపీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షులు బోడ అనిల్, ఆర్ వై ఎప్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, ఏఐపీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ సింగ్ ఠాగూర్ నాయకులు శివ, విలాస్, అబ్దుల్ మజీద్, సయ్యద్ రఫీ ఉద్దీన్, సయ్యద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు
