27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గుద్దేటి రాజన్న మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటు

Must read

📰 Generate e-Paper Clip

సిరికొండ, బతుకమ్మ: కామ్రేడ్ గుద్దేటి రాజన్న అలియాస్ కొట్రాస్ రాజన్న మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ అన్నారు. మండలంలోని పెద్దవాల్గోట్ లో శనివారం  నిర్వహించిన సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ కార్యకర్త, కామ్రేడ్ గుద్దేటి రాజన్న కొట్రాస్ అంత్యక్రియల్లో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాజన్న పార్థివ  దేహంపై ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాజన్న 1990 నుంచి మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ కార్యకర్తగా, పార్టీ ప్రతాప్ దళంలో చాలా కాలం పని చేశారన్నారు. శత్రువు దాడులను ఎదుర్కోవడంలో ధైర్యశాలి అని ఆయన పేర్కొన్నారు. రాజన్న ధర్పల్లి, సిరికొండ, భీంగల్ మండలాల్లో ప్రజలకు తన ఉద్యమ సేవలను అందించారన్నారు. రైతంగ పోరాటల్లో క్రియశీలకంగా పనిచేశారన్నారని కొనియాడారు. రాజన్న కు నివాళులర్పించిన వారిలో జిల్లా నాయకులు ఆర్ రమేశ్, కె.రాజేశ్వర్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, బి.కిషన్, జి సాయారెడ్డి, మండల నాయకులు జి నడ్పినర్సయ్య, ఎం లింబాద్రి, ఈ రమేశ్, బి కిశోర్, ఎండీ అనీస్, ఎస్ కిశోర్, ఏ నిఖిల్, కె.ఆశీష్ తదితరులు ఉన్నారు. 

More articles

Latest article