26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఒక్క పొరపాటు వల్ల రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తోంది

Must read

📰 Generate e-Paper Clip

. . . సగటున రోజుకో రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు

. . . కాంగ్రెస్ ప్రభుత్వ పాలన 13 నెలలు తిరిగే లోపే రైతులు రాలిపోతున్నారు

. . . బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ కమిటీ చైర్మన్, మాజీమంత్రి నిరంజన్ రెడ్డి

బాల్కొండ, బతుకమ్మ :

ఆనాడు కేసీఆర్ ఇచ్చింది ఇయ్యలే అదనంగా ప్రభుత్వం ఇస్తా అన్నది ఇయ్యలేదు ఇంత అవగాహన ఉన్న రైతులు కేసీఆర్  ను ఎలా వదులుకున్నారో ఆ  ఒక్క పొరపాటు వల్లనే రైతుల ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందని బీఆర్ఎస్ రైతు అధ్యాయన కమిటీ చైర్మన్, మాజీ నిరంజన్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని బుస్సాపూర్ లో రైతు అధ్యాయన కమిటీ సమావేశం జరిగింది. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్  ప్రభుత్వం వచ్చిన తర్వాత  సగటున  రోజుకొక రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. 13 నెలల కాలంలో 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. రైతుల్లో ధైర్యం నింపి ఆత్మహత్యలను ఆపేందుకే అధ్యాయన కమిటీ పని  చేస్తుందన్నారు. సమస్యలను రైతు కమిషన్ తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ పై రైతులకు నమ్మకం కోల్పోయిందని అన్నారు. మోడి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రెండు జాతీయ  పార్టీలు ఏకమై స్థానిక పార్టీలను దెబ్బతీస్తున్నాయన్నారు.

 Farmers are having to see suicides due to a single mistake

కాంగ్రెస్ ను రాహుల్ గాంధీ రిపేర్ చేసుకోవాల్సిన  పరిస్థితిలో పాలన ఉందన్నారు. 60 ఏళ్లు దాటిన చిన్నకారు, సన్నకారు  రైతులకు పెన్షన్ ఏమైందని, ఉపాధి హామీకి వ్యవసాయ అనుసంధానం హామీ ఏదని ప్రశ్నించారు. రైతుల కష్టం కుటుంబం కోసం కాదని మొత్తం సమాజం కోసమన్నారు.  ఆంధ్రా వాళ్ళు కృష్ణ  నదికి గండికొట్టారని, గోదావరిని  కుల్లగొట్టే  ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన  రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్,  రసమయి బాలకిషన్ లతో పాటు రైతులు, పార్టీ  నాయకులు, కార్యకర్తలున్నారు.

Farmers are having to see suicides due to a single mistake

More articles

Latest article